అది చట్టాన్ని ఉల్లంఘించడమే

అది చట్టాన్ని ఉల్లంఘించడమే

న్యూ ఢిల్లీ: ఈవీఎంలపై ఆర్టీఐ కింద సమాచారం ఇచ్చేందుకు ఎన్నికల సంఘం నిరారించడంపై కేంద్ర సమాచా ర కమిషన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిం ది. ఇది చట్టాన్ని ఉల్లంఘించ డమేనంటూ ఈసీ తీరును తప్పుబట్టింది. దీనిపై వివరణ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘానికి సీఐసీ తాజాగా ఆదేశాలు జారీచేసింది. రెండేండ్ల క్రితానికి సంబంధించిన ఈ కేసు రికార్డులు, వాదనలను పరిశీలించిన తర్వాత.. ఓ ఆర్టీఐ దరఖాస్తు కింద చట్టప్రకారం 30 రోజుల్లోగా స్పందించకుం డా నిబంధనలను ఉల్లంఘించినందుకు రాతపూర్వక వివరణ ఇవ్వాలని ఇప్పటి ఈసీ సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారి ద్వారా అప్పటి పీఐవోను ఆదేశించినట్టు కేంద్ర సమాచార కమిషనర్ హీరాలాల్ సమారియా తెలిపారు. ఈ ఉల్లంఘనకు ఇంకెవరైనా బాధ్యులు ఉంటే వారికి కూ డా తమ ఆదేశాల కాపీని అందజేయాల ని, వారు కూడా సీఐసీకి సమాధానం ఇ చ్చేలా చూడాలని సీపీఐవోను సీఐసీ ఆదేశించారు. ఎన్నికల సమయంలో ఉపయోగించే ఈవీఎంలు, వీవీప్యాట్ మిషన్ల విశ్వసనీయతపై పలు ప్రశ్నలు లేవనెత్తు తూ పలువురు మాజీ సివిల్ సర్వెంట్లు, ఐఐటీ, ఐఎంఎంల ప్రొఫెసర్లు, టెక్ నిపుణులు, విద్యావేత్తలు 2022, మే 2న ఈసీకి లేఖ రాశారు. కాగా, ఈ రిప్రజంటేషన్పై ఏం చర్యలు తీసుకొన్నారో తెలుపాలని కోరుతూ మాజీ ఐఏఎస్ ఎంజీ దేవ సహాయం ఆర్టీఐ కింద అదే ఏడాది నవంబర్ 22న దరఖాస్తు చేశారు.
అప్పీల్ను పట్టించుకోని ఈసీ అధికారులు
తమ రిప్రజంటేషన్ను ఎవరికి పంపా రు? తాము లేవనెత్తిన అంశంపై సమావేశాల్లో చర్చించారా? తదితర వివరాలను తెలియజేయాలని కోరుతూ దేవసహా యం ఆర్టీఐ కింద దరఖాస్తు చేశారు. అ యితే 30 రోజుల తప్పనిసరి పీరియడ్లో గా ఈసీ నుంచి ఆయనకు సమాధానం రాలేదు. దీంతో దేవసహాయం చేసిన మొ దటి అప్పీల్ను ఈసీ సీనియర్ అధికారు లు పట్టించుకోలేదు. ఆ తర్వాత ఎన్నికల సంఘం నుంచి సమాధానం రాకపోవడంతో ఆయన సెకండ్ అప్పీల్ కోసం కేం ద్ర సమాచార కమిషన్ను ఆశ్రయించా రు. దేవసహాయం దరఖాస్తుకు ఎందుకు స్పందించలేదని సీఐసీ హీరాలాల్ సమారియా అడుగ్గా.. ఈసీ సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారి(సీపీఐవో) నుంచి సంతృప్తికర సమాధానం రాలేదు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos