వైస్ కెప్టెన్ గిల్ ఆనందం

వైస్ కెప్టెన్ గిల్ ఆనందం

జమైకా :
ప్రపంచ కప్పులో పాల్గొనే వెస్టిండీస్‌ జట్టుకు తనను వైస్‌ కెప్టెన్‌గా నియమించినందుకు
క్రిస్‌ గేల్‌ సంతోషం వ్యక్తం చేశాడు. జేసన్‌ హోల్డర్‌ నాయకత్వంలోని ప్రపంచ కప్పు జట్టుకు
గేల్‌ ఎంపికైన సంగతి తెలిసిందే. విండీస్‌ తరఫున ఆడడాన్ని తాను గౌరవంగా భావిస్తానని
గేల్‌ పేర్కొన్నాడు. ప్రపంచ కప్పు తనకు ఎంతో ప్రత్యేకమని, తమపై భారీ అంచనాలు కూడా ఉంటాయని
తెలిపాడు. విండీస్‌ అభిమానులను అలరించడానికి తాము బాగా ఆడాల్సి ఉందన్నాడు. కాగా ప్రపంచ
కప్పులో విండీస్‌ ఈ నెల 31న పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్‌ను ఆడనుంది. ప్రపంచ కప్పు అనంతరం
గేల్‌ వన్డేలకు వీడ్కోలు పలకనున్నాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos