పడుతూ లేస్తూ సాగుతున్న సైరా..

  • In Film
  • October 13, 2019
  • 119 Views
పడుతూ లేస్తూ సాగుతున్న సైరా..

మెగాస్టార్ చిరంజీవి నటించిన భారీ చిత్రం సైరా నరసింహారెడ్డి చిత్రం వసూళ్లు శనివారం నుంచి అనూహ్యంగా పుంజుకున్నాయి.మొదటి వారం రోజులు నిలకడగానే ఉన్న వసూళ్లు ఎనిమిదవ రోజు నుంచి కొద్దిగా తగ్గముఖం పట్టాయి.అయితే శనివారం నుంచి వసూళ్లు అనూహ్యంగా పుంజుకోవడంతో తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ సాధిస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పదో రూ.2.7కోట్ల మేర ఆదాయం తెచ్చిన సైరా.. పదకొండో రోజున దాదాపు రెట్టింపు వసూళ్లను రాబట్టిందని సమాచారం. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం దాదాపు 4నుంచి 5కోట్ల మేరకు కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఇలాగే పుంజుకుంటూ వెళితే.. బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశమున్నట్లు చెబుతున్నారు.తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం ఎలాగోలా బ్రేక్ ఈవెన్ను సాధించేట్టు కనిపిస్తున్నా.మిగిలిన చోట మాత్రం భారీ నష్టాలు తప్పేలా లేవు. కర్ణాటకలో పెద్ద మొత్తంలో టార్గెట్ ఉండటం.. ఇప్పటికీ యాభై శాతం రికవరీ చేయకపోవడంతో నష్టాలు చవిచూసేలా కనిపిస్తోంది. తమిళం, కేరళ, హిందీ, ఓవర్సీస్ అన్ని చోట్ల సైరా కలెక్షన్లు అంతంత మాత్రంగానే ఉండటంతో టార్గెట్ను చేరుకోలేకపోతోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos