వాయు సేనలోకి ‘చినూక్’

చండీఘడ్:భారత వాయు సేన తుణీరంలో సోమవారం అమెరికా తయారి భారీ హెలికాప్టర్లు-చినూక్ చేరాయి. చండీఘడ్ వాయుసేన స్థావరంలో ఇవి విధుల్ని ఆరంభించాయి. వీటిని 19 దేశాలు వినియోగిస్తున్నాయని వాయు సేనాధి పతి బీఎస్ థనోవా తెలిపారు. భారీ ఎత్తున సామగ్రి, ఆయుధాలను తీసుకు వెళ్లగలిగే సామర్ధ్యం వీటికి ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతానికి కొన్న 15 హెలికాప్టర్ల విలువ 1.5 బిలియను డాలర్లు. కీలక ప్రాంతాల్లో వీటిని నిలిపినట్లు తెలిపారు. అపాచీ హెలికాప్టర్లను పఠాన్ కోట్ స్థావరంలో మోహరించామన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos