చైనా నుంచి తరుముకొస్తున్న మరో భయానక వ్యాధి..

చైనా నుంచి తరుముకొస్తున్న మరో భయానక వ్యాధి..

ఇప్పటికే కరోనా మహమ్మారికి పుట్టినిల్లుగా మారి ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలు గాలిలో కలసిపోవడానికి ప్రత్యక్ష కారణంగా నిలిచిన చైనాలో కొత్తగా పుట్టుకొచ్చిన మరో మహమ్మారి ప్రపంచాన్ని కలవరపాటుకు గురి చేస్తోంది.ఇప్పటికే కరోనాకు మందు కనిపెట్టడానికి ప్రపంచం మొత్తం అవస్థలు పడుతున్న తరుణంలో కరోనా కంటే అత్యంత భయంకరమైన బుబోనిక్‌ ప్లేగు ప్రపంచాన్ని మరింత భయపెడుతోంది.తూర్పు చైనా ప్రాంతంలోని ఇన్నర్‌ మంగోలియా అటానమస్‌ పరిధిలోని బయాన్నూర్‌లో బుబోనిక్‌ ప్లేగు పుట్టుకొచ్చింది.కోవ్డ్‌ ప్రావిన్స్‌లో ఓ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు మార్మోట్‌(అడవి ఎలుకలు)మాంసం తినడంతో బుబోనిక్‌ ప్లేగు వ్యాప్తి మొదలైంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos