చైనాతో కయ్యమా?

న్యూ ఢిల్లీ : కనీసం రెండు నెలలకు సరిపడినంత వంట గ్యాస్ ను నిల్వ చేసుకుని పెట్టుకోవాలని కశ్మీర్ ప్రభుత్వం గ్యాస్ కంపెనీలను ఆదేశించటంతో చైనాతో యుద్ధం జరుగనుందన్న ప్రచారం మొదలైంది. వర్షా కాలం లో కొండ చరియలు విరిగిపడి, జాతీయ రహదారులను మూసివేయాల్సి ఉన్నందున గ్యాస్ నిల్వలను పెంచుకోవాలని సూచించామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఏ క్షణమైనా, ఏదైనా జరుగవచ్చని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. భారత సైనికుల పై దాడికి ముందు రోజు సరిహద్దులకు మార్షల్ ఆర్ట్స్ ఫైటర్స్, పర్వతారోహకులను పంపిందని చైనా అధికార మాధ్యమం వెల్లడించిన తరువాత యుద్ధ భయాలు మరింతగా పెరిగాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos