చైనా అధ్యక్షులకు చాపర్‌ ఫోబియా?

చైనా అధ్యక్షులకు చాపర్‌ ఫోబియా?

ఏదేశంలో పర్యటించినా ఎక్కడికి వెళ్లాలన్నా చైనా దేశ అధ్యక్షులు కేవలం విమానాలు,లేదా కార్లను మాత్రమే వినియోగిస్తారని హెలికాప్టర్లను అస్సలు వాడరనే విషయం మరోసారి రుజువైంది.రెండు రోజుల భారత్ పర్యటనకు వచ్చిన చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కూడా చెన్నై నుంచి మహాబలిపురానికి హెలికాప్టర్లో కాకుండా రోడ్డుమార్గంలో తన బలమైన శత్రుదుర్భేద్యమైన ‘హాంగ్ కీ’లో వెళ్లారు. కారులో మహాబలిపురం చేరుకున్నారు. చైనాకు చెందిన అధినేతలు హెలికాఫ్టర్లో ప్రయాణాలు దాదాపుగా చేయరు. అదేదో నియమంలా పాటిస్తారని చైనా విదేశీవ్యవహారాల శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. వారు కేవలం విమానాలు లేదా కార్లను మాత్రమే ప్రయాణానికి వినియోగిస్తారని విదేశాంగ శాఖ వెల్లడించింది. జీ-20 లాంటి సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన సమయంలో కూడా జిన్పింగ్ హెలికాఫ్టర్లో కాకుండా కారులోనే ప్రయాణించేందుకు మొగ్గు చూపినట్లు వారు గుర్తుచేశారు. హాంగ్ కీ కారు చైనాకు చెందిన చాలా శక్తివంతమైన విలాసవంతమైన కారు. అధికారిక కమ్యూనిస్టు చైనా అధినేతలు ఈ కారును వినియోగిస్తారు.1958లో హాంగ్ కీ కారు చైనా అధ్యక్షుడు మావో జెడాంగ్ కోసం ప్రత్యేకంగా చైనా ఫస్ట్ ఆటో వర్క్స్ గ్రూపు తయారు చేసి ఇచ్చింది. చైనాలో వీఐపీలు – ఇతర దేశాల నుంచి వచ్చిన వారు ఈ కారును వినియోగిస్తారు. చైనీస్ బ్రాండ్ కార్లను ప్రమోట్ చేసేందుకు జిన్ పింగ్ ఇలా ఆ కారులో ప్రయాణాలు చేస్తుంటారనే అభిప్రాయం వినిపిస్తోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos