అక్కసు వెళ్లగిక్కన డ్రాగన్ దేశం..

తనకు ఏమాత్రం సంబంధం లేకపోయినా కేవలం భారత్‌పై ఉన్న అక్కసును వెళ్లగక్కాలనే ఉద్దేశంతోనే పక్కనున్న డ్రాగన్‌ దేశం ఆర్టికల్‌ 370 రద్దుపై స్పందించింది.జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని చైనా ఖండించింది.కశ్మీర్విషయంలో భారత్వ్యవహరించిన తీరు తమ సార్వభౌమత్వాన్ని బలహీనపరిచేలా ఉందంటూ చైనా విదేశాంగశాఖ కార్యదర్శి ప్రకటన చేశారు. జమ్ముకశ్మీర్ కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370ను రద్దు చేయడం సహా, కశ్మీర్ ను రెండుగా విభజించడాన్ని తప్పుబట్టింది. జమ్ముకశ్మీర్ అంశం అంతర్జాతీయ వివాదం నెలకొన్న నేపథ్యంలో చర్చల ద్వారా పరిష్కరించుకోవాలే కానీ ఇలా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సబబు కాదంటూ తన ప్రకటనలో తెలిపిందిఅయితే చైనా విడుదల చేసిన ప్రకటనకు పాకిస్తాన్ వత్తాసు పలికింది. భారత్ తీరును తప్పుపడుతూ చేసిన చైనా ప్రకటనను సమర్థించారు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. జమ్ముకశ్మీర్ విభజనపై సోమవారం పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన మిత్ర దేశమైన చైనాకు ఫోన్ చేశారు. అయితే ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు చైనా.చైనాతో పాటు ప్రపంచంలోని దేశాలన్నీ భారత్ అంతర్గత వ్యవహారమంటూ పేర్కొంటున్నాయి. అయితే జమ్ముకశ్మీర్ విభజన బిల్లుకు ఉభయసభలు ఆమోదం తెలిపిన తర్వాత చైనా స్పందించింది. భారత్ చర్యను తీవ్రంగా ఖండించిందిమోడీ సర్కారు తీసుకున్న సాహసోపేతమైన చర్యను యావత్ దేశం హర్షిస్తుంటే.. చైనా మాత్రం తన దరిద్రపు బుద్ధిని మరోసారి చాటుకుంది. అంతేకాదు.. ఎప్పటికి భారత నమ్మలేని దుష్ట డ్రాగన్ అన్న భావన కలిగేలా చేసిందని చెప్పాలిజమ్ముకశ్మీర్ విభజన.. లద్దాఖ్ ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించటం పూర్తిగా భారత్ అంతర్గత వ్యవహారమని.. ఇందులో వేరే దేశాలు జోక్యం చేసుకోవటాన్ని మాత్రం అంగీకరించమని చైనాకు వార్నింగ్ ఇచ్చేసింది.ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో భారత్‌ జోక్యం చేసుకోలేదని అదేవిధంగా భారత్‌ అంతర్గత వ్యవహారాల్లో ఏ దేశ జోక్యాన్ని సహించేది లేదంటూ తేల్చిచెప్పంది.ఆర్థికంగా బలహీనపడుతున్న చైనా రోజురోజుకు అన్ని రంగాల్లో దిగజారుతుంటే భారత్‌ ఏడాదికేడాది సూపర్‌పవర్‌గా ఎదుగుతుండడంతో ఎప్పటినుంచో భారత్‌పై అక్కసు పెంచుకున్న డ్రాగన్‌ దేశం కశ్మీర్‌ అంశాన్ని సాకుగా చూపి తన అక్కసు వెళ్లగిక్కింది..

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos