కూలిపోతున్న చైనా రాకెట్ భాగాలు.. ఇండియాపైనా పడే అవకాశం

కూలిపోతున్న చైనా రాకెట్ భాగాలు.. ఇండియాపైనా పడే అవకాశం

బీజింగ్: చైనా ఇటీవల ప్రయోగించిన లాంగ్ మార్చ్ 5బీ రాకెట్ భాగాలు భూమిపై పడనున్నాయని ఏరో స్పేస్ కార్పొరేషన్ శాస్త్రవేత్తలు ప్రకటించారు. త్వరలోనే అవి భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. అప్పుడు అమెరికా, ఇండియా, హా దక్షిణాసియా ప్రాంతంలో, ఆఫ్రికా, బ్రెజిల్ తదితర ప్రాంతాల్లో ఎక్కడైనా కూలిపడే అవకాశం ఉందని తెలిపారు.కాలిఫోర్నియాలోని ఏరోస్పేస్ కార్పొరేషన్ అంతరిక్షంలోని ఉప గ్రహాలు, రాకెట్ల భాగాలు, ఇతర వస్తువులను పరిశీలిస్తూ ఉంటుంది. భూమిపై పడిపోబోయే ఉప గ్రహాలు, రాకెట్ భాగాలను గుర్తించి హెచ్చరిస్తుంది. చైనా జూలై 24 న లాంగ్ మార్చ్ 5బీ రాకెట్ ద్వారా తమ రోదశీ కేంద్ర మాడ్యూల్ ను అంతరిక్షంలోకి పంపింది. ప్రయోగా నంతరం రాకెట్ ప్రధాన భాగాలు భూమి చుట్టూ తిరుగుతూ ఉండిపోయాయి. ఒకసారి భూ వాతావరణంలోకి అవి ప్రవేశించగానే అత్యంత వేగంతో మండి భూ ఉపరితలంపై పడతాయి. జూలై 31 తేదీన రాకెట్ భాగాలు భూ వాతావరణంలోకి ప్రవేశించే వీలుందని ఏరోస్పేస్ అంచనా వేసింది. కూలిపోతున్న రాకెట్ భాగాల్లో 25.4 టన్నుల బరువైన భారీ బూస్టర్ కూడా ఉంది. అది నివాసాలపై పడితే పెద్ద నష్టమే సంభవిస్తుంది. చైనాపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని రాకెట్ భాగాలతో పెద్దగా నష్టం సంభవించే అవకాశాలు తక్కువని చైనాకు చెందిన గౌంచా వెబ్ సైట్ పేర్కొంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos