చిదంబరం విచారణ పూర్తి

చిదంబరం విచారణ పూర్తి

న్యూ ఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా అవినీతి కేసులో నిందితుడు కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరాన్ని గురువారం సిబిఐ సుమారు మూడు గంటల పాటు విచారించింది. ఐఎన్ఎక్స్ కేసులో ఇంద్రాణీ ముఖర్జీ పాత్ర, హై కోర్టు ఆదేశాల అనంతరం కనిపించకపోవడానికి గల కారణాల గురించి అధికార్లు ప్రశ్నింయినట్లు తెలిసింది. విచారణకు ముందు ఆహారాన్ని చిదంబరం తిరస్కరించారు. దరిమిలా అల్పాహారాన్ని ఇంటి నుంచి తెప్పించుకునేందుకు అనుమతినిచ్చారు. ఇంటి భోజనాన్ని తెప్పించుకునేందుకు అంగీకరించలేదు. మరి కాసేపట్లో ఆయన్ను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే కోర్టు వద్దకు కాంగ్రెస్ సీనియర్ నేతలు కపిల్ సిబల్, అభిషేక్ సింగ్వి చేరుకున్నారు. కార్తి చిదంబరం, చిదంబరం భార్య నళినీ చిదంబరం, సీనియర్ న్యాయవాది వివేక్ ఠంకా కోర్టు చేరారు. తన అరెస్టును నిరసించిసీబీఐ, ఇడిలకు వ్యతిరేకంగా చిదంబరం అత్యున్నత న్యాయ స్థానంలో రెండు వ్యాజ్యాల్ని దాఖలు వేశారు. ఈడీకి వ్యతిరేకంగా వేసిన వ్యాజ్యం శుక్ర వారం విచారణకు రావచ్చు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos