అధికార్లను చెప్పులతో కొట్టండి

అధికార్లను చెప్పులతో కొట్టండి

లఖ్‌నవు: మాట వినని అధికార్లను చెప్పులతో కొట్టాలని భాజపా ఉత్తర ప్రదేశ్, లలితాపూర్ భాజపా శాసనసభ్యుడు రామ్ రతన్ కుష్వాహ తమ పార్టీ కార్యకర్తలకు చేసిన సూచన రాద్ధాంతమైంది. సంబంధిత వీడియో సామాజిక మాధ్యమాల్లో సంచలనమైంది. ‘ఉత్తర ప్రదేశ్ అధికారులు ఒక నెలలో పని మొదలు పెట్టక పోయినా, పార్టీ కార్యకర్తల్ని వేధించినా గురిచేసినా, అక్కడే మీ చెప్పులు తీసి వారిని కొట్టండి. ఎందుకంటే సహనానికి కూడా ఓ హద్దు ఉంటుంది. ఎస్పీ, బీఎస్పీలకు విధేయులైన కొందరు అధికారులు ఎన్నికల్లో వ్యవహరించిన మాదిరిగానే మీ పట్ల దురుసుగా వ్యవహరిస్తారు. వాళ్లతో జాగ్రత్తగా ఉండండి’ అని ఆయన మార్గ నిర్దేశనం చేసారు. అధికారులపై భాజపా నేతలు నోరు జారడం కొత్తేం కాదు. ప్రియాంక రావత్ సహా పలువురు గతంలో ఉన్నతాధికారుల్ని బెదిరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos