ఛార్మీకి చుక్కలు చూపిస్తున్నారట..

  • In Film
  • September 17, 2019
  • 118 Views
ఛార్మీకి చుక్కలు చూపిస్తున్నారట..

డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తో కలిసి గత కొంతకాలంగా సినిమా నిర్మాణాల్లో భాగమవుతూ వస్తున్న ఛార్మికి ఇటీవల విడుదలైన ఇస్మార్ట్ శంకర్ ఆర్థిక వ్యవహారాలు తలనొప్పిగా పరిణమించాయని సమాచారం.పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ సంయుక్త సమర్పణలో తెరకెక్కిన ఈ సినిమా ఫైనాన్సియల్ వ్యవహారాలన్నీ ఛార్మియే హ్యాండిల్ చేశారు.ఇస్మార్ట్ శంకర్ ప్రమోషన్స్ మొదలుకొని బయ్యర్స్, సినిమా కొనుగోళ్ల వ్యవహారాలు అన్ని ఛార్మీయే దగ్గరుండి చూసుకున్నారు.చిత్రానికి మంచి మార్కెట్ రావాలనే ఉద్దేశంతో తక్కువ ధరలకే కొనుగోలుదారులకు చిత్రాన్ని విక్రయించారు.విడుదలయ్యాక లాభాల గురించి కొనుగోలుదారులతో చర్చిద్దామని భావించారట.ఇప్పుడు ‘ఇస్మార్ట్ శంకర్’ కొనుగోలు వ్యవహారం ఛార్మికి ఇప్పుడు కష్టాలు తెచ్చిపెడుతోంది, లేని తలనొప్పిగా మారిందని కథనాలు వెలువడుతున్నాయి. బయ్యర్లకు రెట్టింపు లాభాలు వచ్చినా ఛార్మికి రావాల్సిన మొత్తం రావడం లేదని తెలుస్తోంది.అయితే బయ్యర్లందరూ అలా లేరని, కొందరు ఇవ్వాల్సిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తుండగా.. ఇంకొందరు మాత్రం ఛార్మికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా చుక్కలు చూపిస్తున్నారట. అలా రావలసిన మొత్తం కోట్లలో ఉందని అంటున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos