వైభవంగా కుంభాభిషేకం

వైభవంగా కుంభాభిషేకం

హొసూరు : ఇక్కడికి సమీపంలోని కెలమంగళంలో అతి పురాతన దేవాలయమైన శ్రీ చంద్రమౌలేశ్వరస్వామి, అమృతేశ్వరి దేవాలయంలో ప్రతిష్ఠాపన, కుంభాభిషేకం కార్యక్రమాలను మూడు రోజుల పాటు అతి వైభవంగా నిర్వహించారు. కెలమంగలం దొడ్డేగానిపల్లి సమీపంలో సుమారు అయిదు వందల సంవత్సరాల కిందట నిర్మించిన చంద్రమౌలేశ్వర స్వామి దేవాలయం శిథిలావస్థలో ఉండేది. ఈ దేవాలయాన్ని గ్రామస్థులు, దాతలు జీర్ణోద్ధరణ చేసి మూడు రోజుల పాటు విగ్రహ ప్రతిష్ఠ, కుంభాభిషేక కార్యక్రమాలను నిర్వహించారు. అందులో భాగంగా శుక్రవారం గణపతి హోమంతో పూజలను ప్రారంభించారు. అనంతరం గంగ పూజ, పుణ్యఃవాచన, యాగశాల పూజలు నిర్వహించారు. రెండవ రోజైన శనివారం గణపతి ప్రార్థన, వేద పారాయణం, బింబ శుద్ధి, కలశ స్థాపన, మహా గణపతి హోమం, మహా మంగళ హారతి తదితర కార్యక్రమాలను నిర్వహించారు. ఆదివారం గోపూజ, కళాశార్చన, శ్రీ చంద్రమౌలేశ్వర, అమృతేశ్వర, నవ గ్రహాల ప్రాణ ప్రతిష్ఠ నిర్వహించారు. చివరగా మహా రుద్ర హోమం, పూర్ణాహుతి నిర్వహించిన వేద పండితులు మంగళ వాయిద్యాల మధ్య కుంభాభిషేక కార్యక్రమాన్ని పూర్తి చేశారు. తరువాత చంద్రమౌలేశ్వర స్వామికి మహా మంగళ హారతి, తీర్థ ప్రసాద వినియోగం చేశారు. ఈ కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos