మోదీ మన ప్రధాని… అలా చేయకూడదు

పాట్నా : ‘దసరా ఉత్సవం సందర్భంగా మోదీ దిష్టి బొమ్మలు కాల్చడం చూసి ఆశ్చర్యపోయాను. ఇది చాలా విచారకరం.మోదీ దేశ ప్రధాని . చాలా చేయకూడద’ని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హితవు పలికారు. బుధవారం చంపారన్లో జరిగిన ఎన్నికల ప్రచార బహిరంగ సభలో ప్రసంగించారు. ‘యువతకు ఉద్యోగ, ఉపాధి లభించడం లేదు. ముఖ్యమంత్రి నితీశ్ అత్యంత బలహీనంగా ఉండటమే దీనికి కారణం. ఉద్యోగాలను కల్పిస్తామని వాగ్దానాలు చేస్తారు. కానీ వాటిని నెరవేర్చరు. దేశంలో లాక్డౌన్ విధించడం, పెద్ద నోట్ల రద్దు. రెండింటి లక్ష్యం ఒకటే. అది చిన్న వ్యాపారులను దెబ్బ తీయటం. చిన్న వ్యాపారులను తుడిచిపెట్టేసే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. లాక్డౌన్ కారణంగా చాలా మంది తమ ఉపాధిని కోల్పోయారు. బిహారీలు తమ శక్తిని అర్థం చేసుకోవాలి. గాంధీజీ కూడా స్వాతంత్ర్యోద్యమాన్ని చంపారన్ నుంచే ప్రారంభించారు. గతంలో మోదీ పర్యటించినపుడు ఇక్కడ చక్కెర ఫ్యాక్టరీని నెలకొల్పి, ఛాయ్ తాగుతామని ప్రకటించారు. ఇప్పటి వరకూ మోదీ చాయ్ తాగారా? ఈ రోజుల్లో ఉద్యోగాల కల్పనపై మోదీ ప్రకటనలివ్వరు. ఎందుకంటే ఆయన మాటలను నమ్మే స్థితిలో బిహార్ ప్రజలు లేర’ని ఎద్దేవా చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos