మోదీ బంధువైనా డోంట్ కేర్..

మోదీ బంధువైనా డోంట్ కేర్..

చట్టాలు,శిక్షలు కఠినంగా లేకపోవడాన్ని ఆసరాగా తీసుకున్న చైన్ స్నాచర్లు ఎంతకు తెగబడుతున్నారో ప్రతిరోజూ చూస్తూనే ఉన్నాం.తాజాగా చైన్ స్నాచర్లు ప్రధాని నరేంద్ర మోదీ అన్న కుమార్తెను లక్ష్యంగా చేసుకొని స్నాచింగ్‌కు పాల్పడ్డారంటే దొంగల్లో ధైర్యం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది.అది కూడా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి కూతవేటు దూరంలోనే ఈ ఘటనలో చోటు చేసుకోవడం ప్రజలను,అధికారులకు ఉలిక్కి పడేలా చేసింది. శనివారం ఉదయం అమృత్‌సర్‌ నుంచి ఢిల్లీ చేరుకున్న మోదీ అన్న కుమార్తె దమయంతి బెన్ మోదీ సివిల్ లైన్స్ ప్రాంతంలోని గుజరాతీ సమాజ్ భవన్లో అంతకుముందే బుక్ చేసుకున్న గదికి చేరుకోవడానికి అక్కడికి చేరుకున్నారు.వాహనం దిగి గేటు వద్దకు వచేసరకు ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు ఆగంతకులు దమయంతి హ్యాండ్ బ్యాగును లాక్కెళ్లారు. బ్యాగులో దాదాపు 56వేల నగదు, రెండు సెల్ ఫోన్లు ముఖ్యమైన పత్రాలు ఉన్నట్టు దమయంతి సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.కేసును తీవ్రంగా పరిగణించిన పోలీసులు నిందితుల వేటలో నిమగ్నమయ్యారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos