కేంద్రం ఆ పని ఎందుకు చేయ లేదు?

కేంద్రం ఆ పని ఎందుకు చేయ లేదు?

న్యూ ఢిల్లీ : సరిహద్దులో యథాతథ స్థితి పునరుద్ధరణకు చైనాపై భారత ప్రభుత్వం ఎందుకు ఒత్తిడి తీసుకురాలేదని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మంగళ వారం ట్విట్టర్లో ప్రశ్నించారు. ‘జాతికి సంబంధించిన విషయాలు చాలా ముఖ్యం. వాటిని రక్షించే బాధ్యత భారత ప్రభుత్వానికి ఉంది. అలాంటప్పుడు.. చైనాతో యథాతథ స్థితిని పునరుద్ధరణకు భారత్ ఎందుకు కృషి చేయలేదు? గల్వాన్ ఘటనలో 20 మంది భారత జవాన్లను పొట్టనపెట్టుకున్న చైనాకు తన వైఖరిని సమర్థించుకునే అవకాశం భారత్ ఎందుకు ఇచ్చింది? గల్వాన్ లోయ సార్వభౌమాధికారాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు ఎందుకు?’అని నిలదీశారు. చైనాతో సరిహద్దు వివాదంపై గత కొంత కాలంగా భాజపా- కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. భాజపా వైఖరిలో లోపాలున్నాయని అనేక మార్లు ఆరోపణలు చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos