సెంట్రల్ విస్టా పనుల్ని నిలిపేయాలి

సెంట్రల్ విస్టా పనుల్ని నిలిపేయాలి

న్యూ ఢిల్లీ: సెంట్రల్ విస్టా ఎవెన్యూ రీడెవలప్మెంట్ నిర్మాణ పనుల్ని వెంటనే నిలిపివేయాలని కోరుతూ మంగళవారం దాఖలైన వ్యాజ్యంపై విచారణను న్యాయ మూర్తులు డీన్ పటేల్, జస్మీత్ సింగ్తో కూడిన హైకోర్టు ధర్మాసనం 17వ తేదీకి వాయిదా వేసింది. కరోనా ఉధృతంగా ఉన్న కారణంగా ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అధారిటీ ఉత్తర్వులకు లోబడి సెంట్రల్ విస్టా ఎవెన్యూ రీడవలప్మెంట్ ప్రాజెక్టుకు చెందిన నిర్మాణ కార్యక్రమాలను నిలిపి వేయాలని ఫిర్యాదుదార్లు కోరారు.
వ్యాజ్యంలోని సందేహాస్పదమైనందున దాన్ని తిరస్కరించాలని కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ చేతన్ శర్మ కోరారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రాజెక్టు పనులు కొనసాగించడం వల్ల ఢిల్లీ ప్రజలు, అక్కడి కార్మికుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని పిటిషనర్లు అన్య మల్హోత్రా, సోహైల్ హష్మి తరఫున సీనియర్ అడ్వికేట్ సిద్ధార్ధ్ లుథ్రా తెలిపారు. నిర్మాణ పనులు ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ జారీ చేసిన ఉత్తర్వులకు పూర్తి ఉల్లంఘన అని పేర్కొన్నారు. కరోనా నియంత్రణ పనులకూ ప్రయత్నాలకు విఘాతమవుతుంద న్నారు. నిర్మాణం పూర్తి కావడానికి గడువు నిర్దేశించినంత మాత్రాన అది నిత్యావసర సేవల కిందకు ఎలా వస్తుందని ప్రశ్నించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos