సెల్ ఫోన్ల గజ దొంగ అరెస్టు

సెల్ ఫోన్ల గజ దొంగ అరెస్టు

హోసూరు : లారీలలో కోట్ల రూపాయలు విలువ చేసే సెల్ ఫోన్లను దోపిడీ చేసిన మధ్య ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ముఠా నాయకుణ్ణి హోసూరు పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. హోసూరుకు తీసుకొచ్చారు. గత నెల 21వ తేదీ కాంచీపురం జిల్లా వాలాజలోని సెల్ ఫోన్ల తయారీ కంపెనీ నుంచి రూ.10 కోట్ల విలువ చేసే సెల్ ఫోన్లను కంటైనర్ లారీలో ముంబైకు తరలించారు. కృష్ణగిరి-సూలగిరి జాతీయ రహదారి ఆలగుబావి సమీపంలో లారీ హోసూరు వైపు వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు కారులో వచ్చి లారీని అడ్డగించారు. అనంతరం డ్రైవర్లను చితకబాది లారీలో ఉన్న రూ.10 కోట్ల విలువ చేసే సెల్ ఫోన్లను దోచుకెళ్లారు. ఈ సంఘటనపై సూలగిరి పోలీసులు కేసు నమోదు చేసుకొని, ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల విచారణలో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన దొంగల ముఠా సెల్ ఫోన్లను దోచుకెళ్లినట్లు గుర్తించిన హోసూరు పోలీసులు మధ్యప్రదేశ్, ఢిల్లీ, ముంబై ,గుజరాత్ రాష్ట్రాలలో దొంగల ముఠా కోసం వెతికారు. నెలరోజుల తరువాత దొంగల ముఠా నాయకుడైన భరత్ తెజ్వాని అనే వ్యక్తిని ఢిల్లీలో పోలీసులు అరెస్టు చేసి హోసూరుకు తరలించి కోర్టులో హాజరుపరిచారు. దేశవ్యాప్తంగా పలుచోట్ల దోపిడీలకు పాల్పడి, తప్పించుకు తిరుగుతున్న దొంగల ముఠా నాయకుణ్ణి ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేయడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos