యాదాద్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ…

యాదాద్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ…

తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ప్రముఖమైనదైన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ముస్తాబయింది.నేడ(శుక్రవారం)బ్రహ్మోత్సవాలకు అంకురార్సణ చేసి రక్షాబంధనం, స్వస్తివాచనం నిర్వహించనున్నారు.బ్రహ్మోత్సవాల సందర్భంగా యాదాద్రి దేవాలయాన్ని అందమైన విద్యుత్‌ దీపాలతో అలంకరించారు.బ్రహ్మోత్సవాల కోసం ఆలయంలో హోమగుండం, యాగశాలను సిద్ధం చేశారు.నేటి నుంచి ఈనెల18వ తేదీ వరకు కొనసాగనున్న లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు 40 మంది రుత్విక్కులకు ఆహ్వానం పలికారు.రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్‌,కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా లక్షల సంఖ్యలో భక్తులు బ్రహోత్సవాలకు రానున్న నేపథ్యంలో ఎండలను దృష్టిలో పెట్టుకొని ఆలయప్రాంగణంలో చలువ పందిళ్లు వేశారు.బ్రహ్మోత్సవాల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్సాటు చేశారు.మార్చ్‌9వ తేదీన దేవతాహ్వానం పలుకనుండగా మార్చ్‌10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు అంలకారం,వాహనసేవలు నిర్వహించనున్నారు. చివరిరోజు హైస్కూల్‌ మైదానంలో లక్ష్మీనరసింహాస్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగనుంది..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos