415 మంది కరోనా పీడితులు

415 మంది  కరోనా పీడితులు

కరోనా కేసులు415
న్యూ ఢిల్లీ: కరోనా వైరస్ పీడితుల సంఖ్య భారత్లో సోమవారం 415కు చేరిందని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) ప్రకటించింది. దేశ వ్యాప్తంగా 17,493 మంది నుంచి 18,383 మచ్చుల్ని సేకరించి పరీక్షలు నిర్వహించామనితెలిపింది. బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండడంతో కొవిడ్-19 దశపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విదేశాల్లో ప్రయాణించని వారినీ ఇది పీడిస్తుండటం ఆందోళనరంగా పరిణమించింది. పలు రాష్ట్రాలు ఈ నెల 31 వరకూ లాక్డౌన్లు ప్రకటించటంతో దాదాపు 80 ప్రధాన నగరాలు, పట్టణాల్లో కార్యకలాపాలు స్తంభించిపోయాయి. మహారాష్ట్రలో తాజాగా ఈ కేసుల సంఖ్య 89కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.ముంబైలో కొవిడ్-19 నుంచి కోలుకున్న 68 ఏళ్ల వ్యక్తి ఒకరు ఆ తర్వాత అనంతరం మరణించారు. పిలిప్పైన్స్ నుంచి వచ్చిన అతడికి కరోనా సోకినట్లు నిర్ధారించారు. చికిత్స తర్వాత కోలుకున్నట్లు ప్రకటించారు. గత రాత్రి ఆ వ్యక్తి చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos