సాహో నిర్మాతలపై కేసు..

సాహో నిర్మాతలపై కేసు..

భారీ వ్యయంతో ఎన్నో అంచనాల మధ్య ఆగస్ట్ 30వ తేదీన విడుదలైన సాహో వసూళ్ల పరంగా విధ్వంసం సృష్టించి ట్రేడ్ పండితులను ఆశ్చర్యపరచింది.నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ సుమారు రూ.475 కోట్ల మేర వసూళ్లు సాధించి ఔరా అనిపించింది.తాజాగా సాహో చిత్ర నిర్మాతలపై బెంగళూరుకు చెందిన ఓ బ్యాగుల కంపెనీ పోలీసులకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. ఈ సినిమాలో తమ బ్రాండ్ అయిన ఆర్క్ టిక్ ఫాక్స్ పేరును చూపిస్తామని రూ. 37 లక్షలు తీసుకున్నారని అయితే సినిమాలో తమ బ్రాండ్ ఎక్కడా కనిపించలేదని బెంగళూరుకు చెందిన జౌట్ షైన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. సినిమా నిర్మాతలు వంశీ కృష్ణారెడ్డి, యూ ప్రమోద్, విక్రమ్ రెడ్డిలతో సెలబ్రిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఈసీఓ డీ హిమాంద్ డీల్ కుదుర్చుకున్నారని, ఇందులో భాగంగా సినిమా మధ్యలో తమ బ్రాండ్ ను చూపించాల్సి వుందని విజయ్ రావు తన ఫిర్యాదులో తెలిపాడు. సినిమా బ్రాడ్ కాస్టింగ్ కోసం అదనంగా కోటి రూపాయలను ఇన్వెస్ట్ చేశామని తెలిపారు. సినిమా మధ్యలో తమ బ్రాండ్ ఎక్కడా చూపించలేదని ఆయన ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు, విచారణ ప్రారంభించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos