దారి తప్పిన పోలీసులపై కేసు

న్యూఢిల్లీ: కారులో ప్రయాణిస్తున్న తను మాస్క్ ధరించలేదని రూ. 500 జరిమాన విధించి పరువు తీసినందుకు పోలీసుల నుంచి రూ. పది లక్షలు పరిహారాన్ని ఇప్పించాలని న్యాయవాది ఒకరు ఇక్కడి ఉన్నత న్యాయస్థానంలో వ్యాజ్యాన్ని దాఖలు చేసారు. ఫిర్యాదు సహేతుకంగా ఉన్నందున వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించినట్లు జస్టిస్ నవీన్ చావ్లా తెలిపారు. విచారణ నవంబరు 18కి వాయిదా పడింది. ముసుగు లేకుండా బహిరంగ ప్రదేశంలో కారు నడుపిన నేరానికి ఆ న్యాయవాదికి పోలీసులు జరిమానా విధించారు. దీన్ని ఆయన ఆక్షేపించారు. ‘నా సొంత కారులో నేను ఒక్కడినే ఉన్నా. అటువంటి సమయాల్లో ముసుగు అవసరం లేదని కేంద్ర మార్గదర్శకాల్లో స్పష్టంగా ఉంది. ప్రజల మధ్యకు వెళ్లినపుడు నేను ముసుగు ధరిస్తాను. ఒంటరి వేళల్లో అది అవసరం లేదు. కరోనా నిబంధనలను అన్నిటినీ పాటిస్తున్నా. అయినా అన్యాయంగా పోలీసులు వేధించి జరిమాన వసూలు చేసారు. నాకు ఎంతో మానసిక ఒత్తిడి కలిగింది. నేను ఒంటరిగా ఉన్న పుడు ముసుగు ధరించక పోయినా ఇతరులకు హాని జరగద’ని వ్యాజ్యంలో విపులీకరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos