కరోనా కార్లు వచ్చాయి

కరోనా కార్లు వచ్చాయి

కొచ్చి: కరోనా కట్టడికి కేరళ ప్రభుత్వం ప్రైవేటు ట్యాక్సీలో ప్రయాణికుల మధ్య భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేసింది. విదేశాల నుంచి విమానాలు, నౌకల్లో తిరిగి వస్తున్న వారిని తరలించేందుకు ఈ ట్యాక్సీలను వినియోగించనున్నారు. కారు లోపల ప్రయాణికులకు, డ్రైవర్కు మధ్య ప్లాస్టిక్ తెరలతో పారదర్శక విభజన ఏర్పాటు చేశారు. పారదర్శక విభజనలతో కారు లోపల భౌతిక దూరం పెరగడంతో పాటు తుమ్మినా, దగ్గినా మరొకరికి వైరస్ వ్యాపించకుండా ఉంటుంది. ఎర్నాకుళలం జిల్లా అధికార యంత్రాంగం సూచన మేరకు పారదర్శక విభజనలు ఏర్పాటు చేసినట్టు ఎంజీఎస్ లాజిస్టిక్స్ సంస్థ వెల్లడించింది. కేంద్ర వైద్యారోగ్య శాఖ తాజా గణింకాల ప్రకారం కేరళలో ఇప్పటివరకు 512 కరోనా పాజిటివ్ కేసులు నమోదుగా, నలుగురు చనిపోయారు. 489 మంది కోలుకున్నారు .

తాజా సమాచారం

Latest Posts

Featured Videos