మళ్లీ కోవిడ్‌ పంజా

మళ్లీ కోవిడ్‌ పంజా

న్యూఢిల్లీ : కోవిడ్ – 19 కొత్త వేరియంట్తో మళ్లీ కలకలం సృష్టిస్తోంది. ఇప్పటి వరకు 324 కేసులు నమోదయ్యాయి. ఇన్సాకోగ్ డేటా ప్రకారం… కేపీ 2 -290, కేపీ 1 – 34 కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ జేఎన్1 సబ్ వేరియంట్లని, ఆస్పత్రిలో చేరేంత తీవ్రత లేదని, కేసుల్లోనూ పెరుగుదల లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. అందువల్ల ఎలాంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని వెల్లడించింది. ఐఎన్ఎస్ఏసీఓజీ ఈ కొత్త వేరియంట్ మీద నిఘా పెట్టి, వైరస్ తీవ్రత తెలుసుకునేందుకు నమూనాలు సేకరించేందుకు సిద్ధంగా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇన్సాకోగ్ సేకరించిన డేటా ప్రకారం ఏడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కేపీ 1 వేరియంట్లో 34 కేసులు నమోదయ్యాయి. ఒక్క పశ్చిమ బెంగాల్లో అత్యధిక (23) కేసులు నమోదయ్యాయి. ఇతర రాష్ట్రాలైన గోవా (1), గుజరాత్ (2), హర్యానా (1), మహారాష్ట్ర (4), రాజస్థాన్ (2), ఉత్తరాఖండ్ (1) కేసులున్నాయి. ఇక కేపీ 2 వేరియంట్లో 290 కేసుల్లో మహారాష్ట్ర నుంచి అత్యధికంగా 148 ఉంటే, మిగిలినవి ఢిల్లీ (1), గోవా (12), గుజరాత్ (23), హర్యానా (3), కర్నాటక (4), మధ్యప్రదేశ్ (1), ఒడిశా (17), రాజస్థాన్ (21), ఉత్తరప్రదేశ్ (8), ఉత్తరాఖండ్ (16), పశ్చిమ బెంగాల్ (36) లలో ఉన్నాయి.మే 5 నుంచి 11 వరకు దాదాపు 25,900 కరోనా కేసులు నమోదవ్వడంతో సింగపూర్లో కోవిడ్ తీవ్రత అధికంగా ఉన్నట్టు కథనాలు వస్తున్నాయి. వీటిల్లో కేపీ 1, కేపీ 2 కేసులు మూడింట రెండు వంతులకు పైగా ఉన్నాయి.ప్రపంచవ్యాప్తంగా, ప్రధాన కోవిడ్ -19 వేరియంట్లు ఇప్పటికే జేఎన్.1 తోపాటు కేపీ 1, కేపీ 2లు సబ్వేరియంట్లు ఉన్నాయి. కోవిడ్ – 19 వేరియంట్ సమూహానికి చెందిన కేపీ 1, 2లకు వాటి మ్యూటేషన్లను బట్టి ‘ఫ్లిర్ట్’ అని శాస్త్రవేత్తలు పేరు పెట్టారు. ఈ ఫ్లిర్ట్లోని జాతులన్నీ జేఎన్ 1 మూలం కలిగినవే. ఇక కేపీ 2 ఓమిక్రోన్ వేరియంట్కు ఒక శాఖ అని, దీన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ పర్యవేక్షణలో ఉన్న కొత్త వేరియంట్గా వర్గీకరించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos