ఇడి విచారణకు కొచ్చర్‌ గైరు హాజరు

ఇడి విచారణకు కొచ్చర్‌ గైరు హాజరు

న్యూ ఢిల్లీ: వీడియో కాన్ గ్రూప్కు రుణ మంజూరులో అవినీతి ఆరోపణల్ని ఎదుర్కొంటున్న ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో, ఎండీ చందాకొచ్చర్ సోమవారం ఇడి విచారణకు గైరు హాజరయ్యారు. ఆనారోగ్యం వల్ల విచారణ హాజరు కాలేకపోయినట్లు ఆమె తెలిపారని అధికారులు చెప్పారు. గత వారం కూడా ఇదే కారణాలతో ఆమె విచారణకు హాజరు కాలేదు. మరి కొందరు బ్యాంకు అధికారులను కూడా ఈడీ త్వరలో విచారించనుంది.
చందాకొచ్చర్ అవినీతికి పాల్పడి బ్యాంక్ నిబంధనలకు వ్యతిరేకంగా వీడియోకాన్ గ్రూప్నకు రూ.1875 కోట్ల రుణం మంజూరు చేసారనేది ఆరోపణ.ఈ వ్యవహారంలో ఆమె భర్త దీపక్ కొచ్చర్ కూడా ప్రముఖ పాత్ర వహించారు. అందువల్ల ఆయన, ఆయన రాజీవ్ కొచ్చర్ను కూడా ఇడి పలుమార్లు విచారించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos