42 ఏళ్ల నిర్మాణం…24 గంటల్లోనే నీటిపాలు

42 ఏళ్ల నిర్మాణం…24 గంటల్లోనే నీటిపాలు

రాంచీ : ప్రభుత్వంలో పనులు నత్తనడకలా సాగతాయనడానికి ఇదో చిన్న ఉదాహరణ. ఓ సాగు నీటి కాలువను 42 ఏళ్ల పాటు నిర్మించారు. ప్రారంభించిన 24 గంటల్లోనే అది కొట్టుకుపోయింది. జార్ఘండ్‌లో ఈ సంఘటన జరిగింది. 42 ఏళ్ల కిందట ఉమ్మడి బిహార్‌లో హజారిబాగ్‌ జిల్లాలోని కోనార్‌ నదికి కాలువను నిర్మించారు. అప్పట్లో నిర్మాణ అంచనా వ్యయం రూ.12 కోట్లు కాగా పూర్తయ్యేసరికి ఆ వ్యయం తడిసి మోపెడై రూ.2,176 కోట్లకు చేరింది. ఎలాగో పూర్తయిన ఆ కాలువను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రఘువర్‌దాస్‌ బుధవారం ప్రారంభించారు. అద్భుతంగా పని చేశారంటూ ఆయన అధికారులకు కితాబునిచ్చారు కూడా. గురువారం వచ్చిన వరదలకు కాలువ ఆనవాళ్లు కూడా లేకుండా కొట్టుకుపోయింది. కాలువ గట్లలో ఎలుకలు బొరియలు తవ్వినందున, వరద నీరు లీకై, మొత్తం కొట్టుకుపోయిందని అధికారులు తేలికగా వివరణ ఇచ్చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos