మహిళలకు బంగారం కాదు ఐరన్‌ కావాలట..

మహిళలకు బంగారం కాదు ఐరన్‌ కావాలట..

ధనత్రయోదశి నేపథ్యంలో మహిళలకు ఇవ్వాల్సింది,కావాల్సింది బంగారం కాదని ఇనుము అంటూ డీఎస్ఎం అనే సంస్థ రూపొందించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన వైరల్గా మారింది.మహిళలకు పౌష్టికాహారం అవసరం గురించి వివరిస్తూ ప్రాజెక్ట్ స్త్రీధన్ పేరుతో రూపొందించిన వీడియో తెగ వైరల్ అయ్యింది.ధనత్రయోదశి రోజున బంగారం కొనే డబ్బుతో ఐరన్ పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలు కొనుగోలు చేసి తినాలంటూ వీడియోలు వివరించారు.నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలో 53 శాతం మంది మహిళలు రక్తహీనత (ఎనీమియా)తో బాధపడుతున్నారు.ఈ నేపథ్యంలో మహిళలకు పౌష్టిక ఆహారం ఎంత ముఖ్యమో వివరిస్తూ రూపొందించిన ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు..

తాజా సమాచారం