సూలగిరి యూనియన్‌లో ఊపందుకున్న ఎన్నికల ప్రచారం

సూలగిరి యూనియన్‌లో ఊపందుకున్న ఎన్నికల ప్రచారం

హొసూరు : కృష్ణగిరి జిల్లాలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. మంగళవారం నామినేషన్ల పరిశీలన ముగియడంతో బరిలో ఎవరెవరున్నారో తేలిపోయింది. ఏడీఎంకె, డీఎంకే పార్టీల  తరపున జిల్లా కౌన్సిలర్, యూనియన్‌ కౌన్సిల్ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు ప్రచారం జోరుగా సాగిస్తున్నారు. సూలగిరి యూనియన్ జిల్లా కౌన్సిలర్ స్థానానికి ఏడీఎంకే తరఫున 9వ వార్డు నుంచి పోటీ చేస్తున్న సీకనపల్లి గ్రామానికి చెందిన వెంకటాచలపతి ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు. ఆ ప్రాంతంలో పూల వ్యాపారిగా పేరున్న ఆయన జిల్లా కౌన్సిలర్ స్థానం నుంచి మంచి మెజారిటీతో గెలుపొందుతారని ఆ ప్రాంత ప్రజలు విశ్వాసం వ్యక్తం చేశారు.  ఏడీఎంకే తరఫున జిల్లా ఎనిమిదో వార్డు కౌన్సిలర్ స్థానానికి పోటీ చేస్తున్న ఎస్. లోకేష్ కూడా మంచి మెజారిటీతో గెలుపొందే అవకాశాలున్నాయనే అంచనాలున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos