అమెజాన్ ను నిషేధించండి

అమెజాన్ ను నిషేధించండి

న్యూ ఢిల్లీ: ఈ-కామర్స్ పోర్టల్, అమెజాన్ ను భారత్ లో నిషేధించాలని భారత వ్యాపార సంఘాల సమాఖ్య (సీఏఐటీ) డిమాండ్ చేసింది. దేశంలోని చిరు వ్యాపారులను, చిన్న సంస్థలను అమెజాన్ చిదిమేస్తోందని విమర్శించింది. ఇష్టం వచ్చిన రీతిలో ధరలు, భారీ రాయితీలు ప్రకటించి, నియంత్రిత సరఫరాలకు పాల్పడుతోందని అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘భారీ నిధులు కలిగివున్న అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి సంస్థల విధానాలపై దర్యాప్తు చేపట్టాలి. ఈ రెండు ఈ-కామర్స్ సంస్థలు ఫెమా (విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం)లోని లొసుగులను ఆసరాగా చేసుకుని వ్యాపార రంగంలో పోటీని అణగదొక్కుతున్నాయని
సీఏఐటీ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ ఆరోపించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos