టెన్నిస్ బంతే ఇంతవాడిని చేసింది…బుమ్రా

  • In Sports
  • February 14, 2019
  • 164 Views
టెన్నిస్ బంతే ఇంతవాడిని చేసింది…బుమ్రా

టెన్నిస్‌ బంతితో చిన్నప్పుడు క్రికెట్‌ ఆడడమే ప్రస్తుతం తాను అందుకున్న స్థానానికి కారణమని పేస్‌ బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రా తెలిపాడు. బౌలింగ్‌ అంటేనే తనకు ఇష్టమని, చిన్నప్పుడు టెన్నిస్‌ బాల్‌తో విపరీతంగా ప్రాక్టీస్‌ చేసేవాడినని వివరించాడు. అప్పుడే తాను ఎంత వేగంగా బౌలింగ్‌ వేయగలనో గ్రహించానన్నాడు. బౌలింగ్‌ చేసేటప్పుడు టెన్నిస్‌ బంతి నేలకు తాకితే వేగం తగ్గుతుందని, అందుకని తాను గాలిలోనే వేగంగా బౌలింగ్‌ చేయడం అలవాటు చేసుకున్నానని వివరించాడు. తానిప్పుడు చక్కగా యార్కర్లు వేయడానికి కూడా టెన్నిస్‌ బంతే కారణమన్నాడు. తన బౌలింగ్‌ తీరుపై చాలా మంది సలహాలు ఇచ్చినప్పటికీ, తనకు ఇష్టమైన రీతిలోనే బౌలింగ్‌ చేసేవాడినని తెలిపాడు. అదే తనకు ఎంతగానో ఉపకరించిందన్నాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos