విరగ కాసిన రాగి

హొసూరు : హొసూరు ప్రాంతంలో ఈ ఏడాది రాగి పంట బాగా పండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హొసూరుతో పాటు డెంకణీకోట ప్రాంతంలో ప్రధాన పంటగా రాగిని ఎక్కువగా రైతులు పండిస్తున్నారు. ఈ ఏడాది రెండు ప్రాంతాల్లో సుమారు 40 వేల హెక్టర్లలో రాగి పంటను సాగు చేసినట్లు అధికారులు తెలిపారు. గత అయిదు సంవత్సరాలు వర్షాలు సరిగ్గా కురవక రాగి పంట అంతంత మాత్రంగానే పండింది. ఈ ఏడాది సకాలంలో కురవడంతో బ్రహ్మాండంగా పండింది. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos