స్టాక్ మార్కెట్లకు లాభాల పంట

స్టాక్ మార్కెట్లకు లాభాల పంట

ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్ని దండిగా గడించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 163 పాయింట్లు పెరిగి 39,779 వద్ద, నిఫ్టీ 47 పాయింట్లు పెరిగి 11,918 వద్ద ట్రేడింగ్ను సమప్తం చేసాయి. హెచ్సీఎల్ టెక్, టీసీఎస్, ఇన్ఫోసిస్,టాటా స్టీల్, పవర్ గ్రిడ్ షేర్లు భారీగా లాభపడ్డాయి. నిఫ్టీ విభాగాల పరంగా చూస్తే ఐటీ, ఎఫ్ఎంసీజీ సూచీలు 1శాతంపైగా లాభపడ్డాయి. మీడియా, పీఎస్యూ బ్యాంక్ల సూచీలు 2 శాతం వరకు నష్ట పోయాయి.
జమ్ము కశ్మీర్ బ్యాంక్ మాజీ సీఎండీ అవకతవకలకు పాల్పడినట్లు తేలడంతో దాని షేర్లు దాదాపు 20 శాతం పతనమయ్యాయి. జెట్ ఎయిర్వేస్ షేర్లు 8 శాతం విలువ కోల్పోయింది. ఈ సంస్థ ఆర్థిక పరిస్థితి మెరుగు పర్చే ప్రణాళిక మరింత జాప్యం కానుండటంతో ఇందుకు కారణం. అడాగ్ గ్రూప్నకు సంస్థల షేర్లు భారీగా కూలి పోయాయి. ఆర్ పవర్ 20 శాతం పతనమై రూ.4.94 స్థాయికి దిగింది. ఈ కంపెనీ మార్చి త్రై మాసికానికి రూ.3,559 కోట్ల పోవటం దాని షేరు విలువను ప్రభావితం చేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos