హోసూరులో బిల్డర్ ఘరానా మోసం

  • In Crime
  • November 1, 2019
  • 284 Views
హోసూరులో బిల్డర్ ఘరానా మోసం

హోసూరులో ఓ బిల్డర్ ఘరానా మోసానికి పాల్పడి ప్రజలకు 20 కోట్లకు కుచ్చుటోపీ పెట్టి పరారయ్యాడు.హోసూరు మత్తిగిరి సమీపంలోని నవది ప్రాంతంలో ఆర్బీ క్వాలిటీ బిల్డర్స్ పేరిట రాజేష్ కన్నా అనే వ్యక్తి కార్యాలయం నిర్వహిస్తూ గత 10 ఏళ్లుగా ఇళ్ళు నిర్మించిఇచ్చేవాడు.కొత్తగా ఇళ్ళు కట్టాలనుకునేవారు ఇల్లు నిర్మించేందుకు రాజేష్ కన్నాకు కాంట్రాక్టు అప్పగించేవారు.ఇళ్ల నిర్మాణంలో నాణ్యతకు ప్రాముఖ్యత నిచ్చే రాజేష్ కన్నాను నమ్మి తమకు ఇళ్ళు నిర్మించి ఇవ్వాలని అతనికి ఎక్కువ మంది కాంట్రాక్టు ఇచ్చారు.ఇదిలా ఉండగా ఇళ్ల నిర్మాణానికి గాను ఒక్కొక్కరి వద్ద 30 నుండి 40 లక్షలవరకు వసూలు చేసి ఇళ్ల నిర్మాణం ప్రారంభించాడు.ఇళ్ల నిర్మాణం సకాలంలో పూర్తి కాకపోవడంతో బాధితులు బిల్డర్ రాజేష్ కన్నా పై ఒత్తిడి పెంచారు.బాధితుల ఒత్తిడి తట్టుకోలేక రాజేష్ కన్నా తను నివాసమున్న ఇంటిని కాలిచేసి కుటుంబంతో పరారైయ్యాడు.రాజేష్ కన్నా సెల్ఫోన్ స్విచ్ ఆప్ కావడంతో బాధితులు అతనికోసం వేదికినా ఫలితం లేకపోవడంతో హోసూరు పోలీసులకు పిర్యాదు చేసారు. బిల్డర్ రాజేష్ కన్నా ఇళ్ల నిర్మాణానికి గాను 20 కోట్లకు పైగా వసూలు చేసి పరారైయ్యాడని బాధితులు వాపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు విచారణ జరుపుతున్నారు.

సగంలో నిలిచిపోయిన కట్టడం


సగంలో నిలిచిపోయిన కట్టడం


రాజేష్ కన్నా కార్యాలయం

తాజా సమాచారం