హర్యానాలో చేతులు కలిపిన కాంగ్రెస్‌, బీఎస్పీ

హర్యానాలో చేతులు కలిపిన కాంగ్రెస్‌, బీఎస్పీ

చండిగడ్: హర్యానాలో కాంగ్రెస్, బీఎస్పీ మధ్య మళ్లీ పొత్తు పొడవనుంది. రానున్న విధాన సభ ఎన్నికల్ని కలిసి నడవాలని ఎదుర్కోవాలని యోచిస్తున్నాయి. సంబంధిత ప్రయత్నాలు మొదలయ్యాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ, కాంగ్రెస్ కూటమిగా పోటీ చేసాయి. ఇదే పొత్తును హర్యానాలో కూడా కొనసాగించాలని రెండు పార్టీల నేతలు భావిస్తున్నారు.గత లోక్సభ ఎన్నికల్లో మొత్తం పది ఎంపీ స్థానాల్నీ భాజపా కైవసం చేసుకుంది. ఆదివారం ప్రధాని మోదీ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. భాజపాను సమర్థంతంగా ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష కాంగ్రెస్ తన వ్యూహాలకు పదును పెడుతోంది. ఇందులో భాగంగా బీఎస్పీతో పొత్తుకు స్నేహ హస్తం అందించింది. మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భూపేందర్ సింగ్ హుడా , ఆదివారం బీఎస్పీ అధినేత్రి మాయావతితో భేటీ అయ్యారు.శాసనసభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు మాయావతి కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. రాష్ట్రంలో మొత్తం 90 శాసనసభ స్థానాలున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos