హస్తం నీడ చేరిన బిఎస్పీ ఎమ్మెల్యేలు

హస్తం నీడ చేరిన బిఎస్పీ ఎమ్మెల్యేలు

జైపుర్: రాజస్థాన్లో ఆరుగురు బిఎస్పీ శాసనసభ్యులు-రాజేంద్ర గుడ్, జోగేంద్ర సింగ్ అవానా, వాజిబ్ అలీ, లఖాన్ సింగ్ మీనా, సందీప్ యాదవ్, దీప్చంద్ ఖేరియా సోమవారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు. దేశంలో పేట్రేగిపోతున్న అసాంఘిక శక్తులపై పోరాడటం, రాష్ట్ర అభివృద్ధి కోసమే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని అంతకు ముందు శాసనస భాపతికి విన్నవించారు. అభివృద్ధి కోసం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభు త్వానికి ఎన్నికల్లో ఆ పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడం ఇబ్బందికరంగా మారిందన్నారు. నిరుడు జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ 100 స్థా నాలు, బీఎస్పీ ఆరు చోట్ల గెలిచింది. బీఎస్పీ , 12 మంది స్వతంత్ర శాసనసభ్యుల మద్దతుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గత మార్చిలో కాంగ్రె స్కు మద్దతుగా నిలిచిన ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలంతా ఆ పార్టీలో చేరారు. తాజాగా బీఎస్పీ సభ్యుల చేరికతో కాంగ్రెస్ బలం 118కి చేరింది తమ ఎమ్మెల్యేల్ని కాంగ్రెస్లో చేర్చుకున్నందుకు బీఎస్పీ అధినేత్రి మాయావతి మండిపడ్డారు. కాంగ్రెస్ విశ్వాసఘాతక పార్టీ అని నిరూపించుకుందని వ్యాఖ్యా నించారు. బేషరతుగా ప్రభుత్వానికి మద్దతు తెలిపినా తమను మోసం చేసిందని దుయ్యబట్టారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos