మహిళల బాగు చూడని మహిళా మంత్రి

మహిళల బాగు చూడని మహిళా మంత్రి

విజయవాడ: ‘కేంద్ర ఆర్థిక మంత్రి మహిళ అయినా దేశ మహిళల ఆర్థిక స్వావలంభనకు తీసుకుంటున్న చర్యలు శూన్యమ’ని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకారత్ శుక్రవారం ఇక్కడ వ్యాఖ్యానించారు. ‘ దేశంలో క్లిష్ట పరిస్థితులు ఏర్పడు తున్నాయి. దేశ ఆర్ధిక వ్యవస్థ దిగజారి పోయేలా కేంద్రం చర్యలు తీసుకుంటోంద’ని విమర్శించారు. నోట్ల రద్దు దేశ అర్థిక వ్యవ స్థపై కోలుకోలేని దెబ్బని విశ్లేషించారు. గ్రామీణ భారత దేశం పనుల కోసం నిరీక్షిస్తోందన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఎందు కు శ్రద్ద చూపడం లేదని ప్రశ్నించారు. ‘దేశంలో నిరుద్యోగ సమస్య పెరుగుతోంది. మహిళలపై అఘాయిత్యాలు పెరిగి పోయాయి. కొన్ని రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలపై లైంగిక దాడి కేసులు నమోదయ్యాయ’ని వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos