బ్రిటన్ ప్రధాని రేసులో వెనకబడిపోయిన రిషి సునక్

బ్రిటన్ ప్రధాని రేసులో వెనకబడిపోయిన రిషి సునక్

లండన్: నిన్నమొన్నటి వరకు బ్రిటన్ ప్రధాని రేసులో ముందంజలో ఉన్న భారత సంతతికి చెందిన మాజీ ఆర్థిక మంత్రి రిషి సునక్ తొలిసారి వెనకబడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బ్రిటన్లోని గ్రాంథాం నగరంలో ప్రసంగించిన ఆయన పోరులో తాను వెనకబడిన విషయాన్ని వెల్లడించారు. కన్జర్వేటివ్ పార్టీలో కొందరు తన ప్రత్యర్థి, విదేశాంగ మంత్రి లిజ్ట్రస్ను ప్రధానిని చేయాలని అనుకుంటున్నారని, ఆయనకు మద్దతు ఇస్తుండడంతో తాను వెనకబడినట్టు పేర్కొన్నారు. అయితే, పార్టీలో కొందరు మాత్రం తన మాట వినేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. బ్రిటిష్ అంతర్జాతీయ మార్కెట్ పరిశోధన సంస్థ ‘యూగవ్’ నిర్వహించిన సర్వేలోనూ సునక్కు ఎదురుగాలి వీస్తున్నట్టు స్పష్టమైంది. 730 మంది కన్జర్వేటివ్ పార్టీ సభ్యులను సర్వే చేయగా వారిలో 62 శాతం మంది లిజ్ ట్రస్ను బలపరిచారు. రిషికి 38 శాతం మంది మాత్రమే మద్దతిచ్చారు. మొత్తం 1.60 లక్షల మంది కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు బ్రిటన్ ప్రధానిని ఎన్నుకోను న్నారు. ఎక్కువ మంది సభ్యులు ఎటు మొగ్గితే వారు ప్రధాని అవుతారు. ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు మొదటి వారం వరకు 12 విడతలుగా ప్రధాని ఎన్నిక జరుగుతుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos