దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది

దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది

న్యూ ఢిల్లీ: హింస కారణంగా దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి బాబ్డే గురువారం వ్యాఖ్యా నించారు. నూతన పౌర సత్వ చట్టాన్ని రాజ్యాంగ బద్ధమైనదిగా ప్రకటించాలని కోరుతూ న్యాయవాది వినీత్ దందా దాఖ లు చేసిన వ్యాజ్యంపై ఈ మేరకు స్పందించారు. నూతన పౌరసత్వ చట్టం రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాల గురించి హింసాత్మక ఘటనలు ఆగాక విచారించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని బాబ్డేతో కూడిన ధర్మాసనం పేర్కొంది. దేశం క్లిష్ట పరిస్థుతులను ఎదుర్కొంటున్నప్పుడు దాఖలయ్యే వ్యాజ్యాలు శాంతిని నెలకొల్పేందుకు కృషి చేసేవిగా ఉండాలన్నారు. రాజ్యాంగం చట్టబద్ధతను అనుమానించేవిగా ఉండకూడదని హితవు పలికారు. ఇలాంటి వ్యాజ్యాల వల్ల ఎలాంటి ఉపయోగం ఉండ దని వ్యాఖ్యానించారు. చట్టం చెల్లుబాటును నిర్ధారించడం కోర్టు విధి అని, అది రాజ్యాంగబద్ధమైందని ప్రకటించ లేమని పేర్కొం ది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos