దేశ ప్రధాన న్యాయమూర్తి బాబ్డే

దేశ ప్రధాన న్యాయమూర్తి బాబ్డే

న్యూఢిల్లీ: అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ శరద్ అర్వింద్ బాబ్దేను నియమిస్తూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ  చేశారు. నవంబర్ 18న ఆయన బాధ్యతల్ని స్వీకరిస్తారు.ఏడాదిన్నర పాటు విధుల్ని నిర్వర్తించనున్నారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ పదవీ కాలం నవంబర్ 17న ముగియనుంది. 1956 ఏప్రిల్ 24న నాగపూర్ లో జన్మించిన బాబ్డే నాగపూర్ విశ్వ విద్యాలయంలో చదివారు. 2000లో బాంబే ఉన్నత న్యాయస్థానం అదనపు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. 2012లో మధ్యప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయ మూర్తి, 2013 ఏప్రిల్ లో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతల్ని నిర్వర్తించారు. అయోధ్య వివాదం , బీసీసీఐ వంటి కీలక కేసులను విచారించిన ధర్మాసనాల్లో ఆయన సభ్యుడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos