బరోడా బ్యాంక్ షేర్ల పతనం

బరోడా బ్యాంక్ షేర్ల పతనం

ముంబై: బ్యాంక్ ఆఫ్ బరోడా షేర్ల విలువ బుధవారం 2.93 శాతం వరకు తగ్గింది. 2018-19లో బ్యాంకు రూ.5,250 కోట్ల మొండి బకాయిల వివరాల్ని దాచి పెట్టిందని ఆర్బీఐ ప్రకటించటం ఇందుకు కారణం. గత మార్చితో అంతమైన ఆర్థిక సంవత్సరానికి రిజర్వు బ్యాంకు అంచనా వేసిన బ్యాంకు నిరర్ధక ఆస్తుల నికర విలువ రూ.75174 కోట్లు కాగా, బ్యాంకు రూ.69,924 కోట్లు అని ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నిరర్థక ఆస్తులు రూ.23,795 కోట్లుగా బ్యాంకు వెల్లడించింది. వాటి విలువ రూ.29,045 కోట్లుగా ఆర్బీఐ తేల్చింది. మధ్యాహ్నం 12 గంటలకు బ్యాంక్ ఆఫ్బరోడా షేర్ల విలువ 2.93 శాతం మేరకు తగ్గి రూ.99.25కు చేరింది. బ్యాంకులో భారత ప్రభుత్వ వాటా 69.23 శాతం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos