రైతులు వద్దన్న చట్టాల్ని ఎందుకు అమలు చేస్తారు?

రైతులు వద్దన్న చట్టాల్ని ఎందుకు అమలు చేస్తారు?

లక్నో : ‘ప్రతి సభలోనూ ప్రధాని మోదీ నిరుద్యోగిత, రైతుల గురించి ప్రస్తావిస్తారు. వారికోసం చేసిందేమీ లేద’ని కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ విమర్శించారు. బిజ్నౌర్ గ్రామంలో సోమవారం జరిగిన కిసాన్ మహాపంచాయత్ సభలో ప్రసంగించారు. ‘2017 నుంచి చెరుకు ధర పెరగలేదు. రైతు రుణాలూ మాఫీ కాలేదు. 16 వేల కోట్ల విమానాల్ని కొన్నారు. కేంద్రం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలతో కేవలం పారిశ్రామికవేత్తలకే లాభం చేకూరుతుంది. చలిలో 80 రోజులుగా ఢిల్లీ పొలిమేరల్లో రైతులు ఆందోళన చేశారు. ఇప్పుడు ఎండ వేడిమితో ఇబ్బందిపడుతూనే ఆందోళన కొనసాగిస్తున్నారు. నూతన సాగు చట్టాలతో రైతులకు లాభమంటూ ప్రధా ని మోదీ పదే పదే చెబుతున్నారు. రైతులు మాత్రం తమకు అవసరం లేదంటున్నారు. కేంద్రం వాటిని ఎందుకు రద్దు చేయదు? పంటను తీసుకోవాలా? వద్దా? అన్నది వ్యాపా రుల ఇష్టాయిష్టాలపై ఆధారపడుతుంది. ఇందువల్ల వ్యాపారులు చెప్పిందే వేదమై కూర్చుంటుంది. రైతుల మాట చెల్లుబాటు కాద’ని విమర్శించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos