దౌర్జన్యకారులూ బంట్రోతులేనా బాలయ్యా

దౌర్జన్యకారులూ  బంట్రోతులేనా బాలయ్యా

అమరావతి: దౌర్జన్యాలకు దిగి హింసించిన తెదేపా నేతలంతా కూడా బంట్రోతులేనా, వారి సంతానమేనని వైకాప ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి శనివారం ట్వీట్లో నటుడు, శాసనసభ్యుడు బాలకృష్ణను ఎద్దేవా చేసారు. ‘తెదేపా శాసనసభ్యులంతా అంతా ప్రజలకు బంట్రోతులేనని బాలయ్య భలే డైలాగ్ చెప్పారు. మహిళా ఎమ్మార్వోను ఇసుకలో పడేసి కొట్టిన ఎమ్మెల్యే కూడా బంట్రోతే. ఆశా చెల్లెళ్లను బండబూతులు తిట్టిన వ్యక్తి కూడా సేవకుడే. ప్రజలను హింసించి వందలకోట్ల రూపాయలు ‘కె ట్యాక్స్’ వసూలు చేసిన స్పీకర్ కూడా పెద్ద బంట్రోతు సంతానమే కదా! అని ట్వీట్లో వ్యాఖ్యానించారు. తెదేపా నేత అచ్చెన్నాయుడిని చంద్రబాబు నాయుడు బంట్రోతు అని వైకాపా సభ్యుడు చెవిరెడ్డి వ్యాఖ్యానించినందకు శాసనసభ్యులంతా ప్రజల బంట్రోతులే నని బాలకృష్ణ వ్యాఖ్యానించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos