గుంటూరులో తెదేపా ఖాళీ?

గుంటూరులో తెదేపా ఖాళీ?

 ఉత్తరాదిలో ఒకట్రెండు మినహా దాదాపు అన్ని రాష్ట్రాల్లో పాగా వేశారు.ఈశాన్య రాష్ట్రాల్లో కూడా బలోపేతమైంది. మహారాష్ట్రలో ఉండేది తమ ప్రభుత్వమే.ఇక దక్షణాదిలో గోవాలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు చేరిపోవడంతో మరింత బలోపేతం కాగా కర్ణాటకలో దాదాపుగా అధికారాన్ని చేజిక్కుంచుకునే దశలో ఉంది.ఇలా దేశంలోని దాదాపు 80శాతాన్ని ఆక్రమించేసినా ఏదో వెలితి.తమిళనాడు,కేరళ,ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు మాత్రం కొరకారాని కొయ్యగా మిగిలాయనే అసంతృప్తి.ఎంత ప్రయత్నించినా ఈ మూడు రాష్ట్రాల్లో కనీసం మూడవస్థానం కూడా దక్కడం లేదు.దీంతో ఈ మూడు రాష్ట్రాలను కూడా తమ అధీనంలోకి తెచ్చుకోవడానికి బీజేపీ అధిష్టానం వ్యూహాలకు పదును పెట్టింది.మొదటగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని లక్ష్యంగా నిర్దేశించుకుంది.అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష తెదేపా పార్టీని కోలుకులేని విధంగా దెబ్బ తీయడానికి ప్రణాళికలు అమలు చేసింది.ఈ క్రమంలో నలుగురు రాజ్యసభ సభ్యులు కమలం గూటికి చేరడంతో తమ ప్రయత్నాలు ఫలిస్తున్నాయని భావించిన బీజేపీ అధిష్టానం మరింత మంది నేతలను బీజేపీలోకి లాగాలంటూ సదరు రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి బాధ్యతలు అప్పగించింది.ఈ క్రమంలో గత రెండు ఎన్నికల్లోనూ జిల్లాలో కొందరికి టిక్కెట్లు ఇవ్వడం ద్వారా తన వర్గంగా ఏర్పాటు చేసుకున్న చౌదరి ఇప్పుడు వారిని బిజెపిలోకి లాగే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. నేతల బలహీనతలను గుర్తించి వ్యూహాత్మకమైన మైండ్ గేమ్ ద్వారా వారిని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. క్రమంలోనే ఎమ్మెల్సీ, టీడీపీ బాపట్ల ఇన్ చార్జ్ అన్నం సతీష్ ప్రభాకర్, ఏకంగా పార్టీతోపాటు తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు. రేపోమాపో బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలుతాజా ఎన్నికల్లో ఓడిపోయిన నేతలు సైతం బీజేపీకి గూటికి చేరుతున్నారు. వరదాపురం సూరి వంటి నేతలు కూడా పార్టీ మారిపోయారు. ఇప్పుడు గుంటూరు నుంచి కూడా కొందరు కీలక నేతలు బీజేపీ బాటలో ఉన్నారు.గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ తాజా మాజీ మంత్రి కూడా బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.గతంలో గుంటూరు నుంచి ఓడిపోయిన టీడీపీ నేత టీవీ రావు కూడా ఇప్పటికే బీజేపీలో చేరారు.మరో సీనియర్ నేత, గతంలో దుగ్గిరాల నుంచి పోటీ చేసి ఓడిన సాంబశివరావు కూడా కాషాయ కండువా కప్పుకునేందుకు తహతహలాడుతున్నారు. టీడీపీ నుంచి రేపల్లె ఎమ్మెల్యేగా గెలిచిన అనగాని సత్యప్రసాద్, ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిశారు. తాను పార్టీ మారడం లేదని ఆయన పైకి చెప్పినప్పటికీ, తన వ్యాపార అవసరాల కమలం గూటికి రేపోమాపో వెళతారు.జిల్లాలో సుజనా చౌదరితో ఎంతో సన్నిహితంగా ఉండే మరో ఇద్దరు టీడీపీ సీనియర్లు కూడా సుజనా వెంట నడిచేందుకు సిద్ధమయ్యారు. వీరిద్దరూ కూడా బయటకు వెళితే జిల్లాలో టీడీపీ ఖాళీ అయినట్టే. ఇలా గుంటూరు జిల్లాలో టీడీపీని ఖాళీ చేయించేందుకు సుజనా చేపట్టినఆపరేషన్సక్సెస్ అయినట్టే అనిపిస్తోంది.దీంతో దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న గుంటూరు జిల్లాలో తెదేపా క్రమక్రమంగా పట్టు కోల్పోతున్నట్లు కనిపిస్తోంది. పార్టీ నేతలందరూ కకావికలం అవుతుండంతో పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితులు తలెత్తాయి. పక్క నేతలు పార్టి మారుతుండడం, మరో పక్క ఉన్న నేతలకు ప్రజల్లో విశ్వసనీయత లేకపోవడంతో ఉనికి కోల్పోయే పరిస్థితులు తలెత్తాయి.పార్టీ లో పాత నాయకులు వెళ్లిపోతే కొత్త నేతలను తయారు చేసుకుంటామని పైకి చెప్పుకొస్తున్నప్పటికి టీడిపి లోలోపల మదన పడుతున్నట్టు చర్చ జరుగోతంది..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos