శేరిలింగంపల్లిలో బీజేపీకి షాక్… సీనియర్ నేత రాజీనామా

శేరిలింగంపల్లిలో బీజేపీకి షాక్… సీనియర్ నేత రాజీనామా

హైదరాబాద్ : శేరిలింగంపల్లిలో బీజేపీకి షాక్ తగిలింది. బీజేపీ సీనియర్ నేత మొవ్వ సత్యనారాయణ పార్టీకి రాజీనామా చేశారు. మొవ్వ సత్యనారాయణతో పాటు నియోజవర్గంలోని బీజేపీ నాయకులు మూకుమ్మడి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా మొవ్వ సత్య నారాయణ మాట్లాడుతూ.. బీజేపీలో సామాజిక న్యాయం జరగడం లేదని.. జీహెచ్ఎంసీ పరిధిలో 18 లక్షలకు పైగా కమ్మ సామాజికవర్గం ఉన్నప్పటికీ.. ఒక్క సీటు కూడా కేటాయించలేదన్నారు. కమ్మ సామాజిక వర్గానికి టికెట్ కేటాయించకపోవడంతో బాధ కలిగించిందన్నారు. తమతో కనీసం చర్చించకుండా పార్టీ మారి వచ్చిన వ్యక్తికి టికెట్ ఇచ్చారన్నారు. టికెట్ ఇచ్చి ఇన్ని రోజులు గడుస్తున్న బీజేపీ అధిష్టానం నుంచి ఎటువంటి హామీ లభించక పోవడం బాధ కలిగించిందని మొవ్వ సత్యనారాయణ తెలిపారు. పార్టీని బలపర్చడానికి చాలా మంది కార్యకర్తలు కష్టపడ్డారన్నారు. తనను నమ్ముకున్న నాయకులు, కార్యకర్తల కోసం బీజేపీకి రాజీనామా చేస్తున్నానన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి తనకు పిలుపు వచ్చిందన్నారు. తన కార్యకర్తలు, నాయకులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని మొవ్వ సత్యనారాయణ తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos