బిట్రగుంటలో రైల్వే కర్మాగారానికి వినతి

బిట్రగుంటలో రైల్వే కర్మాగారానికి వినతి

నెల్లూరు:  రైల్వే కంటోన్మెంట్గా పేరు గడించిన బిట్రగుంట లో కాంక్రీట్ స్లీపర్  తయారీ లేక ఎలక్ట్రికల్ మల్టిపుల్ యూనిట్ మెయింటినెన్స్ కేంద్రం, లేక క్యారేజ్ అండ్ వ్యాగన్ కార్యశాలను నీ ఏర్పాటు చేయాలని నెల్లూరు సభ్యుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి    శుక్రవారం లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గతంలో  రైల్వే మంత్రిగా పని చేసిన లాలూ ప్రసాద్ యాదవ్ బిట్రగుంట లో కాంక్రీట్ స్లీపర్ తయారీ కర్మాగారానికి శంకు స్థాపన చేశారని గుర్తు చేశారు. బడ్జెట్లో దానికి నిధులు కేటాయించనందున  ఆ పథకం అమలు కాలేదన్నారు.  దీని కోసం  బిట్రగుంటలో 1100 ఎకరాల రైల్వే స్థలాన్ని కేటాయించినట్లు చెప్పారు. దేశంలోనే పెద్దదైన లోకోషెడ్లలో బిట్రగుంట ఒకటి కాగా డీజిల్, విద్యుత్‌ ఇంజన్ల ప్రవేశంతో ఈ షెడ్డు మూతపడిందన్నారు. 1885లో నిర్మితమైన ఈ షెడ్లో 1934లో రౌండ్ హౌస్ ఏర్పాటయిందని చెప్పారు. దీని సామర్థ్యం  50 లోకోమోటివ్ ఇంజన్లు. ఇంకా మేజర్ యార్డు కూడా ఉందని చెప్పారు.  పాసింజరు ఎక్స్ప్రెస్ రైళ్లకు డ్రైవర్లు, గార్డులను మార్చే కేంద్రంగా ఉండేదంటూ, ఇప్పటికీ పరిమితంగా  ఆ పని చేస్తోందని వివరించారు. అన్ని సౌకర్యాలూ ఉన్నందున తక్షణం  ఏదో ఒక రైల్వే  పథకాన్ని చేపట్టి గత వైభవాన్ని తేవాలని కోరారు .రాష్ట్ర విభజన వల్ల కలిగిన నష్టాన్ని ఇక్కడ యువతకు ఉపాధి కల్పించడం ద్వారా  న్యాయం  చేయవచ్చునని విజ్ఞప్తి చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos