ఘాటెక్కిన బిర్యానీ ధర

ఘాటెక్కిన బిర్యానీ ధర

హైదరాబాదు: ఆఫ్ఘనిస్థాన్ సంక్షోభం బిర్యానీ పై పడింది. వాటి ధరలు విపరీతంగా పెరిగాయి. బిర్యానీ తయారీకి వాడే రకరకాల మసాల దినుసుల దిగుమతి ఆఫ్ఘనిస్థాన్ నుంచి ఆగిపోవటం దీనికి కారణం. అత్తి పండ్లు, షాజీరా, బ్లాక్ ఆప్రికాట్, గ్రీన్ ఆప్రికాట్ వంటి ఎండు ఫలాలు, ఇతర మసాలల ధరలు భారీగా పెరిగిపోయాయి. జులైలో క ప్లేట్ బిర్యానీ ధర రూ.250. ఇప్పుడు రూ.350కి పెరిగింది. నెల కిందట జంబో ప్యాక్ ధర రూ.600. ఇప్పుడు రూ.700 నుంచి రూ.800 దాకా అమ్ముతున్నారు. ఫ్యామిలీ ప్యాక్ ధర రూ.400 నుంచి రూ.550కి ఎగబాకింది. ఆన్ లైన్ లో ఆర్డర్స్ పెట్టుకునేవారికి జీఎస్టీ, ప్యాకింగ్ చార్జీలు, డెలివరీ చార్జీలు అదనం. బిర్యానీ అంటే ఎంత ఇష్టమైనా.. దాని ధర ఒకేసారి రూ.100కుపైగా పెరగడమంటే మింగుడుపడని విషయమే.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos