ఇంగ్లండ్ జట్టుకు ఎదురు దెబ్బ

  • In Sports
  • April 27, 2019
  • 142 Views
ఇంగ్లండ్ జట్టుకు ఎదురు దెబ్బ

లండన్‌
: ప్రపంచ కప్పు ఆరంభానికి ముందే ఆతిథ్య ఇంగ్లండ్‌కు గట్టి ఎదురు దెబ్బ తలిగింది. జట్టులో
కీలక సభ్యుడు శామ్‌ బిల్లింగ్స్‌ భుజం గాయంతో తప్పుకున్నాడు. వచ్చే నెల ఐర్లండ్‌తో
జరుగనున్న వన్డే సిరీస్‌తో పాటు పాకిస్తాన్‌తో జరుగనున్న టీ20 సిరీస్‌కు కూడా దూరమయ్యాడు.
రాయల్‌ లండన్‌ వన్డే కప్పులో కెంట్‌ తరఫున ఆడుతున్న బిల్లింగ్స్‌ గురువారం గాయపడ్డాడు.
భుజం ఎముక స్థానభ్రంశం చెందినట్లు వైద్యులు తెలిపారు. దానికి అవసరమయ్యే శస్త్ర చికిత్సను
వచ్చే వారమే నిర్వహిస్తామని, అనంతరం అతను పూర్తిగా కోలుకోవడానికి మూడు నుంచి అయిదు
నెలల పడుతుందని వెల్లడించారు. దీంతో అతని స్థానంలో సర్రే వికెట్‌ కీపర్‌ బెన్‌ ఫోక్స్‌కు
చోటు దక్కింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos