విజిల్ ట్రైలర్ టాక్..సౌండ్ సరిపోలేదే..

  • In Film
  • October 13, 2019
  • 131 Views
విజిల్ ట్రైలర్ టాక్..సౌండ్ సరిపోలేదే..

తమిళ ఇళయదళపతి విజయ్ నటించిన కొత్త చిత్రం బిగిల్‌పై తమిళంలో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.దీపావళి పండుగ రోజును భారీ ఎత్తును విడుదల కానున్న బిగిల్ చిత్రం కోసం తమిళనాట ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.ఈ క్రమంలో ఆదివారం చిత్ర బృందం విడుదల చేసిన ట్రైలర్ అంచనాలను మరోస్థాయికి తీసుకెళ్లింది.ఇక ఈ చిత్రాన్ని తమిళంతో పాటు తెలుగులో కూడా దీపావళి రోజునే విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.తెలుగులో విజిల్ పేరుతో విడుదల కానున్న ఈ చిత్రంలో ఇందులో విజయ్ మూడు డిఫరెండ్ గెటప్ లలో కనిపిస్తున్నాడు. ఫుట్ బాల్ కోచ్ గా ఫుట్ బాల్ ఆటగాడిగా వీధి రౌడీగా మూడు విభిన్నమైన షేడ్స్ లో కనిపించడం ఆకట్టుకుంటోంది.అయితే ఈ చిత్రంపై తమిళంలో ఉన్న క్రేజ్,అంచనాలు మాత్రం తెలుగులో మాత్రం పెద్దగా లేవు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos