ఆమె చేసిన ట్వీట్ ఐటీ దాడులకు కారణమైందా!

  • In Film
  • February 9, 2020
  • 133 Views
ఆమె చేసిన ట్వీట్ ఐటీ దాడులకు కారణమైందా!

తమిళనాడులో రజనీకాంత్‌ తరువాత అంతటి క్రేజ్‌ సొంతం చేసుకున్న స్టార్‌హీరో ఇళయదళపతి విజయ్‌తో పాటు బిగిల్‌ చిత్ర నిర్మాత కల్పాత్తి అఘోరా ఇళ్లు,కార్యాలయాలపై ఐటీ అధికారుల దాడులు తమిళ చిత్ర పరిశ్రమలో కలకలం రేపుతోంది.ఐటీ దాడుల్లో నిర్మాత ఇంట్లో వందల కోట్ల విలువ చేసే అక్రమ ఆస్తులు గుర్తించగా విజయ్‌ సుమారు రూ.100 కోట్ల మేర పన్నులు ఎగ్గొట్టినట్లు ఐటీ దాడుల్లో వెలుగు చూసినట్లు సమాచారం. మాస్టర్ షూటింగ్ లో ఉన్న విజయ్ ను షూటింగ్ ఆపివేసి మరీ చెన్నైకి ఐటీ శాఖ వారు ప్రభుత్వ కారులో తీసుకు రావడం జరిగింది. సుదీర్ఘ సమయం పాటు విజయ్ ను విచారించడంతో పాటు ఆయన ఆస్తుల వివరాలను మరియు ఇంట్లో ఉన్న నగదు ఇతరత్ర విషయాలపై లెక్కలు తీసుకున్నారు. ఇక మరో వైపు ఏజీఎస్ ఆఫీస్ మరియు నిర్మాత ఇంట్లో సోదాలు నిర్వహించగా డబ్బు కట్టలతో ఉన్న బ్యాగ్ లు మరియు కోట్ల విలువ చేసే వజ్రాలు.. బంగారం బయట పడ్డాయి. అంతే కాకుండా దాదాపుగా రూ.500 కోట్ల విలువ చేసే ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా లభ్యం అయ్యాయట.ఏజీఎస్ కార్యాలయంలో రూ.77 కోట్ల రూపాయల నగదు లభ్యం అవ్వడం ప్రస్తుతం షాకింగ్ గా ఉంది. ఇండస్ట్రీలో చాలా సంవత్సరాలుగా ఫైనాన్సియర్ గా మరియు నిర్మాతగా కొనసాగుతున్న కల్పాత్తి అఘోరా మొత్తం అక్రమంగా.. బ్లాక్ మనీతోనే బిజినెస్ చేస్తున్నాడా అంటూ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. డబ్బులను లెక్కించేందుకు చిన్న మెషన్స్ సరిపోక పోవడంతో బ్యాంకుల నుండి పెద్ద మెషన్స్ తెప్పించి మరీ అధికారులు దాదాపుగా మూడు గంటల పాటు లెక్కించినట్లుగా తెలుస్తోంది. అఘోరా ఆఫీస్ లు మరియు ఇళ్ల నుండి స్వాదీనం చేసుకున్న పత్రాలు మరియు డబ్బు బంగారం విలువ కట్టి చూడగా దాదాపుగా రూ.300 కోట్ల ఆదాయ పన్నును ఎగేసినట్లుగా అధికారులు అంచనాకు వచ్చారు. ఇక ఆదాయానికి అఘోరా సరైన లెక్కలు కూడా చూపించలేదట.మరో వైపు విజయ్ ఇంట్లో కూడా ఆదాయానికి మించిన ఆస్తులు మరియు డబ్బు బంగారంను అధికారులు స్వాదీనం చేసుకున్నట్లుగా తమిళ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోందివిజయ్ దాదాపుగా రూ.100 కోట్ల వరకు పన్ను ఎగవేసినట్లుగా అధికారులు అంచనాకు వచ్చారు. తమ అభిమాన హీరో ఇంటిపై ఐటీ దాడులను నిరసిస్తూ ఫ్యాన్స్ ఆందోళనకు దిగారు. ఐటీ అధికారులు మాత్రం ఇంకా లోతుగా నిర్మాత అఘోరా మరియు విజయ్ బ్యాంకు ఖాతాను మరియు వారి బంధువుల బ్యాంకు ఖాతాలను కూడా పరిశీలించాలని భావిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.ఐటీ అధికారుల దాడులకు బిగిల్‌ చిత్ర నిర్మాత కల్పాత్తి అఘోరా తనయురాలు చేసిన ఒకేఒక్క ట్వీట్‌ కారణంగా తెలుస్తోంది. బిగిల్ చిత్రం జాతీయ స్థాయిలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల టాప్ 10 జాబితాలో నిలిచిందంటూ చాలా గొప్పగా ప్రకటించింది. దాంతో ఐటీ అధికారుల్లో అనుమానం మొదలైంది. చిత్ర నిర్మాత సమర్పించిన ఐటీ రిటర్న్స్ మరియు హీరో విజయ్ సమర్పించిన ఐటీ రిటర్న్ ను పరిశీలించగా బిగిల్ సినిమాకు విజయ్ తీసుకున్న పారితోషికం మరియు నిర్మాత ఇచ్చిన పారితోషికంను ఇద్దరు వేరు వేరుగా చూపించారట. అక్కడ మొదలైన అనుమానంతో ఐటీ అధికారులు బిగిల్ చిత్ర నిర్మాణ సంస్థ అయిన ఏజీఎస్ ఆఫీస్ లలో సోదాలు నిర్వహించారు

తాజా సమాచారం

Latest Posts

Featured Videos