బిగ్‌బాస్‌లో శృతి మించిన బూతులు..

  • In Film
  • August 6, 2019
  • 174 Views
బిగ్‌బాస్‌లో శృతి  మించిన బూతులు..

ఊహించిన విధంగానే బిగ్‌బాస్‌ తెలుగు మూడవ సీజన్‌ పలు వివాదాలకు,బూతులకు వేదికగా నిలుస్తోంది.రెండవ సీజన్‌లో కొంతస్థాయి వరకు అశ్లీలం,బూతులు వినిపించగా మూడవ సీజన్‌లో ట్రాన్స్‌జెండర్‌ తమన్నా ఎంట్రీతో బూతులు,గొడవలు తారా స్థాయికి చేరుకున్నాయి.హౌస్‌లో తమన్నా మాట్లాడుతున్న బూతులు,చేస్తున్న అతితో కంటెస్టెంట్లతో పాటు ప్రేక్షకులు సైతం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖి కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తూ తమన్నా మాత్రం తగ్గలేదుపునర్నవి జోక్యం చేసుకొని సర్దిచెప్పడంతో తమన్నా తన తిట్లను కాస్త కంట్రోల్ చేసుకుంది. తరువాత మళ్లీ రవికృష్ణపై విరుచుకుపడుతూ నానా రచ్చ చేసింది. మగ వేషంలో ఉన్న ట్రాన్స్ జెండర్ అంటూ అతడిని  దూషించింది.తమన్నా లాంటి వ్యక్తి హౌస్ లో ఉండడాన్ని ప్రేక్షకులు  తట్టుకోలేకపోతున్నారు. ఆమె హౌస్ లో ఉండడానికి వీలు లేదని త్వరగా ఎలిమినేట్ చేయాలని కోరుతున్నారు. తాజా పరిణామాల నడుమ తమన్నా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తమన్నా వ్యవహారశైలితో కంటెస్టంట్స్ ఇమడలేకపోతున్నారు. కనీసం నాగ్ సీన్ లోకి ఎంటర్ అయి వార్నింగ్ ఇవ్వడానికి కూడా లేదు. ఆయన రావడానికి మరో నాలుగు రోజుల సమయం పడుతుంది. ఈలోగా తమన్నా ఎంత రచ్చ చేస్తుందో.ఇదిలా ఉండగా ట్రాన్స్‌జెండర్‌ తమన్నావల్ల హీరోయిన్‌ తమన్నా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.సామాజిక మాధ్యమాల్లో తమన్నా సింహాద్రిని ట్రోల్ చేయాలనుకున్న నెటిజన్లు తమన్నా సింహాద్రి అఫీషియల్ ప్రొఫైల్ దొరకక హీరోయిన్ తమన్నా అఫీషియల్ ఐడీని లింక్ చేసి ట్వీట్ చేస్తున్నారు. కొందరైతే తమన్నా సింహాద్రి సోషల్ మీడియా లింక్స్ తెలియక అసలు తమన్నానే డైరెక్ట్ గా తిట్టి పోస్తున్నారు. దీంతో గత పదిరోజులుగా తమన్నాకి ట్విట్టర్ ఓపెన్ చేయడం ఇబ్బందిగా మారింది

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos